Monday, August 3, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలమత శిశు ఆటో స్టాండ్ వద్ద గణతంత్ర వేడుకలు

మత శిశు ఆటో స్టాండ్ వద్ద గణతంత్ర వేడుకలు

📰 Generate e-Paper Clip

జిల్లా రవాణా శాఖా అధికారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ

నవగీతం,జగిత్యాల:

గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని సోమవారం జిల్లా రవాణా శాఖా అధికారి చేతుల మీదుగా జగిత్యాల మత శిశు సంక్షేమ దవాఖాన ఆటో స్టాండ్ ఆవరణలో డిటిఓ శ్రీనివాస్ జాతీయ పతాకవిష్కరణ చేశారు. 

 కార్యక్రమం అనంతరం డిటిఓ  శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రైవర్ అంటే ఒక సమాజ సేవకుడు తాము చేసే వృత్తి సక్రమంగా చేయాలనీ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయరాదని తప్పనిసరిగా అన్ని పత్రాలు మరియు ప్రతి డ్రైవర్ తమ యూనిఫామ్ ధరించాలని రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరూ తమ విధుల పట్ల అవగాహనా కలిగి ఉండాలని ఏ సమయం లో నయినా అందుబాటులో ఉండేది ఒక ఆటో డ్రైవరన్న మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు అభిలాష్,రజాక్, మాత శిశు సంక్షేమ హాస్పిటల్ ఆటో రిక్షా అడ్డ అధ్యక్షులు చింత సుధీర్, బొల్లిశేఖర్,కాముడు శ్రీనివాస్,మాజీ కోశాధికారి శ్రీనివాస్,ఎండి సలీం, ఎండి కుద్బొద్దీన్,ఎండి షకీల్,ఎండి పాషా,రమేష్ తదితర ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular