Sunday, March 1, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలభద్రత పర్యవేక్షణలో ఈవీఎంలు- కలెక్టర్ బి సత్యప్రసాద్

భద్రత పర్యవేక్షణలో ఈవీఎంలు- కలెక్టర్ బి సత్యప్రసాద్

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల ప్రతినిధి :

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు గురువారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల ఈవీఎం లను భద్రపరిచిన గోదామును తనిఖీ చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలన జరిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతినెల ఈవీఎంలను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు. గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో అదనపు కలెక్టర్ బిఎస్ లత ,జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, కలెక్టరేట్ ఏవో హకీమ్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular