Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణకరీంనగర్బిఆర్ఎస్  నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

బిఆర్ఎస్  నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

📰 Generate e-Paper Clip

నవగీతం,చొప్పదండి

చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి మరియు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేస్తున్న ప్రజా సేవకు ఆకర్షితులై నేడు చొప్పదండి  క్యాంప్ కార్యాలయంలో మండలంలోని రాగంపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు గసికంటి సోనియా కుమార్ (4వ వార్డ్ సభ్యురాలు) , గ్రామశాఖ మహిళ అధ్యక్షురాలు కవిత, 12వ వార్డ్ సభ్యులు అవుల శ్రీనివాస్, మావురాల ఎల్లమ్మ సాంగ్ ఫేమ్ ఉద్యమ కవి గాయకులు గసికంటి కుమార్,నాయకులు డి రాజయ్య, కె అనిల్, కె మహేష్, బి సురేష్, కె ప్రభాకర్, కె లక్ష్మణ్, డి.అంజయ్య, జి.అంజయ్య, డి.శేఖర్, బి.మహేష్, మాణిక్యం, అనిల్ కుమార్, కుమారస్వామి గార్లతో పాటు దాదాపు 50మంది నాయకులు, కార్యకర్తలు,  మహిళలు, యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరగా వారికి చొప్పదండి శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ సముచిత గౌరవం దక్కుతుందని ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ వైస్ ఛైర్మన్ మునిగాల రాజేందర్, ఉపసర్పంచ్ కళ్ళెం రవీందర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఈర్ల స్వామి, వార్డు సభ్యులు ఈర్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular