Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపుచ్చకాయ సాగు పై రైతు నేస్తం లో వివరణ

పుచ్చకాయ సాగు పై రైతు నేస్తం లో వివరణ

📰 Generate e-Paper Clip

పుచ్చకాయ పంటలను సందర్శించిన జిల్లా అధికారులు

నవగీతం,మల్లాపూర్:

మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామంలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా పోగుల నరేష్ పుచ్చకాయ తోట ను జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్  జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ సందర్శించారు.ఈ సందర్భంగా పుచ్చకాయ తోటలోని సాగులో మేలుకువలను రైతు స్వయంగా రైతు నేస్తం కార్యక్రమంలో వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి మాట్లాడుతూ ఉద్యాన పంటలకు సంబంధించిన పనిముట్లు, స్ప్రేయర్లు, గడ్డి కోసే మిషిన్, 50 శాతం సబ్సిడీ బై అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా రైతు కోరిన విధంగా తేనెటీగ పెంపకం కోసం బాక్సులను కూడా 50% సబ్సిడీపై చేస్తున్నట్లు ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. పుచ్చకాయ సాగు చేసే రైతులకు మల్చింగ్ ,డ్రిప్  సబ్సిడీ తదితర పథకాలను ఉద్యాన శాఖ ద్వారా అందించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సేంద్రీయ పద్ధతి ద్వారా పుచ్చకాయ సాగు చేస్తున్న ముత్యంపేట గ్రామంలోని రైతు శ్రీనివాస్ పుచ్చకాయ తోట ను కూడా సందర్శించడం జరిగింది. ఇట్టి క్షేత్ర సందర్శనలో వ్యవసాయ సహాయ సంచాలకులు నాయుడు, వ్యవసాయ అధికారి టెక్నికల్ శ్రీనివాస్, ఉద్యాన అధికారి శ్రీనివాస్, అర్చన ,వ్యవసాయ అధికారి లావణ్య ,వ్యవసాయ విస్తరణ అధికారి, తదితర గ్రామ రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular