Sunday, September 20, 2026
ads
Homeజిల్లా వార్తలుహైదరాబాద్జర్నలిస్టుల నైతిక నియమావళి-మీడియా చట్టాలు అంశంపై అవగాహన

జర్నలిస్టుల నైతిక నియమావళి-మీడియా చట్టాలు అంశంపై అవగాహన

📰 Generate e-Paper Clip

భూ హక్కులు, భూ బారతి వ్యవసాయం పై వర్క్ షాప్

నవగీతం,హైదరాబాద్

హైదరాబాద్ నాంపల్లి ఛాపెల్ రోడ్‌లోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో ‘భూహక్కులు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి – పర్యావరణం’ అంశాలపై బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు. తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఆధ్వర్యంలో సమన్వయకర్త దేశాయ్ కరుణాకర్, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ సమన్వయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 300 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం మరియు రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా పారదర్శకత పెరిగి, భూమి కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. భూహక్కుల పరిరక్షణలో భాగంగా ‘భూభారతి’ పథకం ద్వారా రైతుల భూములను గుర్తించి, వారికి చట్టబద్ధ హక్కులు, పత్రాలు అందజేస్తున్నామని వివరించారు. రైతు కమిషన్ సభ్యుడు భూమి సునీల్ మాట్లాడుతూ భూ చట్టాలు, భూ సమస్యల పరిష్కార విధానాలపై వివరించారు. భూభారతి పథకం, కొత్త ఆర్‌ఓఆర్ చట్టం ప్రజాపాలనలో కీలక మార్పులకు దారితీస్తున్నాయని అన్నారు.‘ధరణి’ పోర్టల్‌లో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు స్పష్టమైన నిబంధనలు లేవని పేర్కొన్నారు. ఆర్డీవో చేసిన మ్యూటేషన్లు లేదా సాదా బైనామాల క్రమబద్ధీకరణపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.కలెక్టర్ తీర్పుపై అసంతృప్తి ఉంటే భూమి ట్రిబ్యునల్‌కు రెండో అప్పీల్ దాఖలు చేసుకోవచ్చని సూచించారు.జర్నలిస్టులకు అవగాహన‘జర్నలిస్టుల నైతిక నియమావళి – మీడియా చట్టాలు’ అంశంపై తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టులకు అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాలు, రెవెన్యూ అంశాలపై సీనియర్ జర్నలిస్టు శిరందాస్ ప్రవీణ్ కుమార్ వివరించారు. ‘డిజిటల్ రిపోర్టింగ్ -వ్యవసాయం, రైతు సమస్యలు’ అంశంపై జర్నలిస్టు కలమండ శరత్ ప్రసంగించారు.నాబార్డు మాజీ సీజీఎం మోహనయ్య, పర్యావరణ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణపై మాట్లాడారు.అనంతరం శిక్షణలో పాల్గొన్న జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ తరఫున సర్టిఫికెట్లుఅందజేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా నుండి రాజేంద్రప్రసాద్ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంద వేణుగోపాల్ గౌడ్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొమ్ము గణేష్, జాతీయ నాయకులు సయ్యద్ నిజాముద్దీన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సభ్యులు చెన్న దేవేందర్, బల్ల చిన్న అంజయ్య తదితరులు పాల్గొని సర్టిఫికెట్లు అందుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular