Saturday, March 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఘనంగా 13వ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా 13వ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి:

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మెట్ పల్లి పట్టణ జనసేన పార్టీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చెన్నకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి, వివేకానంద విగ్రహానికి,పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బిస్కెట్లలను పంపిణీ చేయగా, రాధ్న్య బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం నిర్వహించగా జనసేన సైనికులు,పవన్ కళ్యాణ్ అభిమానులు సుమారు 60మంది స్వచ్ఛందగా రక్తదానం చేశారు.

అయ్యప్ప గుడి ఆవరణలో  చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.అనంతరం రోడ్డు పైన ఉండే నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందు తీసుకెళ్తామని,అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎలుగందుల అజయ్ కుమార్,బండి రమాదేవి,మ్యాడరపు మారుతి,అబ్బూరి ఆనంద్ రాజ్ గౌడ్, కోటగిరి అరుణ్ గౌడ్,వన్నెల రాకేష్, కడరి శ్రీకాంత్, పర్రె సంతోష్,రాం ప్రసాద్, యూసుఫ్ నగర్ ఉపసర్పంచ్ బసవేని రమేష్,మణి సాయి, ఉదయ్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular