ఉగాది పురస్కారాలు పోస్టర్ ఆవిష్కరించిన మేయర్ కొలాగాని శ్రీనివాస్
నవగీతం, కరీంనగర్:
తెలంగాణ చేనేత ఐక్యవేదిక, పద్మశాలి వ్యాపార నెట్ వర్క సంయుక్తంగా నిర్వహిస్తున్న హ్యాండ్లూమ్ ఎక్స్పో 2026,పద్మశాలి ఉగాది పురస్కారాలు పోస్టర్ ను కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ కోలగాని శ్రీనివాస్, తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వీర మోహన్ మాట్లాడుతూ ఈనెల 21, 22 తేదీలలో హైదరాబాద్ ఎల్బీనగర్ లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో 2026 పద్మశాలి ఉగాది పురస్కారాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పద్మశాలి ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు, కళాకారులకు, వ్యాపార సామాజిక రంగాలకు చెందిన ప్రతిభావంతులకు తెలుగు సంవత్సరాది ఉగాది పురస్కారాలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ హ్యాండ్లూమ్ ఎక్స్పోలో చేనేత వస్త్ర ప్రదర్శనతో పాటు విభిన్న రకాల ప్రదర్శనలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఆటపాటలు నిర్వహించబడతాయని అన్నారు. అలాగే వివిధ వ్యాపారులు తమ తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శన చేసుకొని విక్రయాలు చేసుకోవడానికి ఈ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వివిధ చేనేత ఉత్పత్తుల ప్రదర్శన కోసం స్టాల్స్ ఏర్పాటు చేసుకొనుటకు కమిటీ వారిని సంప్రదించాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం మేయర్ తో పాటు నూతనంగా ఎన్నికైన పద్మశాలి కార్పొరేటర్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలిగేటి శ్రీనివాస్, కార్పొరేటర్లు వాసాల రమేష్, వేముల కవితా చంద్రశేఖర్, దేవసాని సరస్వతి సత్యనారాయణ, మాసం గణేష్, బండ రమణా, సోమిడి వేణు, కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం కోశాధికారి గజవెల్లి కనకయ్య, పోపా ఉపాధ్యక్షులు పిస్క లక్ష్మీనారాయణ, గాజుల భగవాన్,భీమనాథని శారద, సిరిసిల్ల సురేష్, ఆడపు మునిధర్, కొక్కుల గోవర్ధన్ మంచాల మోహన్, పద్మశాలి కుల నాయకులు పాల్గొన్నారు.

