Sunday, September 20, 2026
ads
Homeజిల్లా వార్తలుహైదరాబాద్గల్ఫ్ సంక్షేమానికి నిధులకై భట్టికి విజ్ఞప్తి

గల్ఫ్ సంక్షేమానికి నిధులకై భట్టికి విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

బడ్జెట్ సాధన కోసం… అసెంబ్లీకి వెళ్లిన గల్ఫ్ నాయకులు

నవగీతం, హైదరాబాద్:

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులుగల్ఫ్ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ప్రతినిధి బృందం బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ బృందంలో ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల ఉన్నారు. మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular