Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణకరీంనగర్అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి ఆర్డీవో మహేశ్వర్

అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి ఆర్డీవో మహేశ్వర్

📰 Generate e-Paper Clip

నవగీతం, కరీంనగర్:

అంగన్వాడీ స్కూల్‌ల సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో మహేశ్వర్ సూచించారు. పిల్లల సమగ్ర అభివృద్ధిలో ఈ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కరీంనగర్‌లోని కోతిరాంపూర్ అంగన్వాడీ సెంటర్లలో ప్రీ స్కూల్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో మహేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సీడిపిఓ సబితా, 39 డివిజన్ కార్పొరేటర్ లుమాసం గణేష్, కార్పొరేటర్ పాడిశెట్టి వసంతలక్ష్మి భూమయ్య హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆర్డీవో మహేశ్వర్ మాట్లాడుతూ, అంగన్వాడీ స్కూల్‌లు ప్రైవేట్ స్కూల్‌లతో పోలిస్తే కౌశల్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఆటలు, పాటల ద్వారా పిల్లలకు విద్య అందించడం ప్రత్యేకత అని చెప్పారు. చిన్నారుల సామాజిక, మేధో, భాషా, సృజనాత్మక అభివృద్ధికి ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ సెంటర్లలో లభించే పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. సీడిపిఓ సబితా ప్రీ స్కూల్ ప్రాధాన్యతపై వివరించారు. పి అండ్ జీ మాస్టర్ ట్రైనర్ రాజేంద్ర పిల్లలకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. రెండు వందల మంది పిల్లలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపోర్ట్ కార్డులు సీడిపిఓ సబితా, సూపర్వైజర్ అరుణ, నిర్మల, రేణుక అందజేశారు.బి సి సతీష్, టీచర్లు స్వరూప, శ్యామల, సరిత, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular