Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమానస వార్షికోత్సవం “హంగామా 2026”

మానస వార్షికోత్సవం “హంగామా 2026”

📰 Generate e-Paper Clip

ఫోక్ నుండి రెట్రో వరకు కళల హరివిల్లు

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కేంద్రంలో  విద్యా, సాంస్కృతిక రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు “హంగామా 2026 రారండోయ్ వేడుక చూద్దాం …” పేరిట అద్భుతంగా, అత్యంత వైభవంగా, అపూర్వమైన ఉత్సాహంతో ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ మహోత్సవాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ రజితా రావు, ఛైర్మన్  రామాదేవి రవీందర్ రావు,  మౌనిక హరిచరణ్ రావు సంప్రదాయ దీపప్రజ్వలనాతో ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమ ప్రారంభం నుంచే ఆహ్లాదకర వాతావరణం నెలకొని, హాజరైన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా డైరెక్టర్లు  శ్రీధర్ రావు, హరిచరణ్ రావు బియ్యాల సుమన్ రావు విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, వారి భవిష్యత్తు కోసం ప్రేరణాత్మక సందేశాలు అందించారు.ఉదయం ప్రారంభమైన ఈ వేడుకలు సాయంత్రం వరకు నిరంతరం ఉత్సాహభరితంగా కొనసాగాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.ఫోక్ నృత్యాలు భారతీయ సంప్రదాయ సౌందర్యాన్ని ప్రతిబింబించగా, క్లాసికల్ ప్రదర్శనలు కళాత్మక నైపుణ్యాన్ని చాటిచెప్పాయి. రెట్రో థీమ్ ప్రోగ్రామ్స్ ప్రేక్షకులను గతస్మృతుల్లోకి తీసుకెళ్లగా, ఆధునిక నృత్యాలు యువత ఉత్సాహాన్ని ప్రతిబింబించాయి. ప్రతి ప్రదర్శనలో విద్యార్థుల కృషి, క్రమశిక్షణ, మరియుసృజనాత్మకత స్పష్టంగా కనిపించింది.వేదిక అలంకరణ, ఆకర్షణీయమైన లైటింగ్, సంగీత సమన్వయం అన్ని  కలిసిమెలిసి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. ప్రేక్షకుల నుండి ప్రతి కార్యక్రమానికి ఘనమైన చప్పట్లు వెల్లువెత్తాయి.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసి, వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం మాత్రమే కాకుండా, సంస్కృతి మరియు విలువల పట్ల గౌరవాన్ని పెంపొందించే దిశగా మనసా స్కూల్ చేస్తున్న కృషి మరోసారి ప్రతిఫలించింది.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మరియు నిర్వాహకుల సమిష్టి సహకారంతో ఈ వేడుకలు ఘన విజయం సాధించాయని నిర్వాహకులు తెలిపారు. మొత్తానికి జగిత్యాలలో ఈ వార్షికోత్సవం ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక సంబరంగా నిలిచింది అని పలువురు అభిప్రాయం వ్యక్తపరుస్తు అభినందించారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular