Sunday, September 20, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

📰 Generate e-Paper Clip

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గల్ఫ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి అన్నారు. భీమారం మండలంలోని ఒడ్యాడ్ గ్రామంలో బొమ్మెన హారిక ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవంలో గ్రామ సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్దిదారు కుటుంబానికి నూతన వస్త్రాలు సంప్రదాయబద్దంగా అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడున్న తెరాస ప్రభుత్వం డబుల్ బెడ్రూం పేరిట ప్రజలను మభ్యపెట్టి 10 సంవత్సరాలు కాలయాపన చేసిందన్నారు.కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు గూడు కల్పించాలనే ఆలోచనతో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి, ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కళను నెరవేర్చిందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఇళ్లను కల్పిస్తుందని పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మంతెన భారత-రాజేందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సూరు మహేష్, అవ సాగర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురకంటి రాజేశం, గ్రామశాఖ అధ్యక్షులు దువాస గంగాధర్, నాగం మల్లేశం, మ్యాకల మహేష్, బట్టు గంగారెడ్డి, భీమయ్య, గంగారాం, బక్కూరి నరేష్ తో పాటు లబ్దిదారు బొమ్మెన హారిక మరియు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular