Sunday, April 19, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలహైదరాబాద్‌లో ఘనంగా 135వ అంబేడ్కర్ జయంతి వేడుకలు

హైదరాబాద్‌లో ఘనంగా 135వ అంబేడ్కర్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

పెద్దాపూర్ యువత పాల్గొనడం విశేషం

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక సభ విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని శాఖల మంత్రులు, దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోరుట్ల మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన బుడుత గోపి, తెలుకంటి రఘు, గొర్రె రంజిత్‌, మ్యాకల సతీష్, వేద రజిని లు సభకు హాజరై అంబేడ్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. సామాజిక సమానత్వం, న్యాయం కోసం అంబేడ్కర్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలు గ్రామ యువతలో చైతన్యం నింపుతూ, అంబేడ్కర్ సిద్ధాంతాల పట్ల మరింత అవగాహన కల్పించాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular