Friday, August 7, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఘనంగా ఫ్రీ గ్రాడ్యుయేషన్ డే అండ్ ఫేర్వెల్ పార్టీ వేడుకలు

ఘనంగా ఫ్రీ గ్రాడ్యుయేషన్ డే అండ్ ఫేర్వెల్ పార్టీ వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం, కోరుట్ల ప్రతినిధి

మేడిపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పోరుమల్ల పాఠశాలలో యూకేజీ పూర్తి చేసిన విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఐదవ తరగతి పూర్తి చేసిన వారికి నాలుగో తరగతి విద్యార్థులచే ఫేర్వెల్ పార్టీ కూడా నిర్వహించగా విద్యార్థుల ఆటపాటలతో ఆనందోత్సవాల మధ్య జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొలపాక సురేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు మంచి భవిష్యతు ఉంటుందని,ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు నేడు రాష్ట్ర లో ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ లు ఉన్నారని ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని చేర్పించాలని తెలిపారు.అనంతరం మండల విద్యాధికారి ఎస్సై చేతుల మీదుగా బడిబాట పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ప్రగతిని ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. అదేవిధంగా పేరెంట్స్ అందరు కూడా తమ పిల్లల నడవడికపై ఒక కన్నేసి ఉంచాలని వారిని సక్రమమైన మార్గంలో నడిపే బాధ్యత తీసుకోవాలని కోరారు. చివరగా పాఠశాల విద్యార్థులతో అధికారులు అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular