కోరుట్ల పీఓపీ జిప్సం షాప్ ఓనర్స్ ,వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
నవగీతం ,కోరుట్ల ప్రతినిధి :
కోరుట్ల పట్టణంలోని భవన యజమానులు మరియు ప్రజలకు పీఓపీ జిప్సం షాప్ ఓనర్స్ & వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (రిజిస్టర్ నెం: 1021/2023) ఒక ముఖ్య విన్నపాన్ని జారీ చేసింది. స్థానిక కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, పట్టణ ప్రజలు తమ ఇంటి నిర్మాణ పనుల్లో స్థానిక పీఓపీ వర్కర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.అసోసియేషన్ ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ..కోరుట్ల పట్టణంలో ఎంతో కాలంగా నాణ్యమైన పనులను అందిస్తూ, నమ్మకానికి నిలువుటద్దంగా నిలుస్తున్న మన లోకల్ జిప్సం వర్కర్లను ఆదరించడం మనందరి బాధ్యత. ఇటీవల ఇతర రాష్ట్రాల (యూపి) నుండి వస్తున్న అపరిచిత వ్యక్తులకు పనులు అప్పగించడం వల్ల స్థానిక కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. బయటి వ్యక్తుల పనితీరుపై పర్యవేక్షణ ఉండదు మరియు భవిష్యత్తులో పనుల్లో లోపాలు తలెత్తితే వారిని సంప్రదించడం కష్టమవుతుంది.
ప్రజలకు విజ్ఞప్తి: మన ప్రాంతంలోని కార్మికులకు పని కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు ఆసరాగా నిలవండి. నైపుణ్యం కలిగిన లోకల్ వర్కర్ల ద్వారానే పనులు చేయించుకుని నాణ్యతను పొందండి. రిజిస్టర్డ్ అసోసియేషన్ కింద ఉన్న స్థానిక కార్మికులను ప్రోత్సహించి, కోరుట్ల ఆర్థికాభివృద్ధికి సహకరించండి.
మరిన్ని వివరాలకు లేదా జిప్సం పనుల కోసం స్థానిక అసోసియేషన్ సభ్యులను సంప్రదించగలరని కోరుట్ల పీఓపీ జిప్సం షాప్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యవర్గం కోరుతున్నారు.

