Saturday, April 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఉపాది హామీ పథకం పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష

ఉపాది హామీ పథకం పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష

📰 Generate e-Paper Clip

కూలీలకు సమయానికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి

నవగీతం, జగిత్యాల/ మల్లాపూర్:

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్  శనివారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంపుపై ప్రత్యేకంగా చర్చించారు. గ్రామాల్లో మరిన్ని కూలీలను ఉపాధి హామీ పనుల్లో భాగస్వామ్యం చేయాలని  సూచించారు. ప్రతి గ్రామంలో పనుల అందుబాటును పెంచాలని ఆదేశించారు. పనుల ఎంపికలో పారదర్శకత పాటించాలని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారు.పనుల ప్రగతిని రోజువారీగా పర్యవేక్షించాలని అన్నారు. కూలీల హాజరు నమోదు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. మస్టర్ రోల్స్ లో ఎటువంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. కూలీలకు సమయానికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పనుల తీరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఉపాధి హామీ పనులలో మహిళలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ప్రతి పనిని ఫోటో క్యాప్చరింగ్ ద్వారా ఎన్ యం యం ఎస్ యాప్ లో నమోదు చేయాలని చెప్పారు. జియో ట్యాగింగ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

లక్ష్యాలను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని సూచించారు.ఉపాధి హామీ పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజల జీవనోపాధి మెరుగుపడుతుందని తెలిపారు. పనుల ప్రణాళికను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వేసవి కాలం అయినందున ఉపాధి హామీ పనులకు వచ్చే వారికి తగిన ఏర్పాట్లు చేయాలని,  షేడ్ నెట్ లు తగిన నీడ, త్రాగు నీరు, ఓఅర్ఎస్, ప్రథమ చికిత్స మరియు తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఆర్డీఓ నరసింహ రావు, డిఆర్డీఓ రఘువరన్,తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ జగదీశ్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular