మల్లాపూర్,ఆగస్టు10,(నవగీతం):ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎలుక కమలాకర్ నియమితులయ్యారు.ఈ మేరకు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మగ్గిడి వెంకట నరసయ్య నియామక ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం మెట్‌పల్లి పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఎలుక కమలాకర్‌కు నియామక పత్రాన్ని మగ్గిడి వెంకట నరసయ్య అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయడంతో పాటు, యువతను సంఘటితం చేసి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. నూతనంగా నియమితులైన జిల్లా ఉపాధ్యక్షుడు ఎలుక కమలాకర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మగ్గిడి వెంకట్ నరసయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల్క మోహన్, రాష్ట్ర కార్యదర్శి నేరెళ్ల శ్రీధర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పెంటపర్తి అశోక్, మెట్‌పల్లి డివిజన్ కమిటీ నాయకులు తుక్కారామ్, కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు శోభన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం నిరంతరం పనిచేస్తానని,యువజన సంఘం బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎలుక కమలాకర్
0
4
Previous article

