Monday, August 10, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలదేవాలయాల అభివృద్ధి కమిటీ నూతన చైర్మన్‌కు ఘన సన్మానం

దేవాలయాల అభివృద్ధి కమిటీ నూతన చైర్మన్‌కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

మల్లాపూర్,ఆగస్టు10,(నవగీతం): మల్లాపూర్ దేవాలయాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన క్యాతం సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గంగ నర్సయ్య లను మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉపసర్పంచ్ గడ్డం సోమారెడ్డి, ఏనుగు వెంకటరెడ్డి మాజీ అధ్యక్షుడు సంగ గంగరాజం తదితరులు నూతనంగా ఎన్నికైన చైర్మన్, ఉపాధ్యక్షులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. మల్లాపూర్‌లోని దేవాలయాల అభివృద్ధికి కమిటీ సమష్టిగా కృషి చేయాలని, ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల పెద్దమనుషులుఎగుర్ల కొమురయ్య,చిప్పశంకర్,తోట శాంతరాజం  వెల్మల రాజారెడ్డి, నుతిపెల్లి రాజాం,పలువురు ప్రముఖులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular