నవగీతం, సెప్టెంబర్8,(నవగీతం):మల్లాపూర్ మండలం రేగుంట గ్రామానికి చెందిన మోతే శ్రీనివాస్-సంజన దంపతుల కుమార్తె హన్సిక ఇటీవల జరిగిన ఎంబిబిఎస్ మొదటి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాల్లో స్టేట్ మెరిట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా రేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తీట్ల లహరి రాజేష్ ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వైద్యురాలిగ ఎదగాలనే లక్ష్యంతో, చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, క్రమశిక్షణతో, కష్టపడి చదివి సాధించిన మంచి ర్యాంక్ ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శనమని, భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీట్ల లహరి రాజేష్, కార్యదర్శి వినీత, పాలకవర్గ సభ్యులు కలసాని రాజన్న, కత్తి నరేష్, బాస రాజరెడ్డి, మహమ్మద్ బషీర్, జి.పి.ఒ రాములు, నాయకులు రంగు రామాగౌడ్, సురకంటి తిరుపతి రెడ్డి, బి.ఎల్.ఓ. శోభరాణి, రాజమ్మ, యం.యల్.హెచ్.పి దీప్తి, ఏ.ఎన్ యం. రాధ తదితరులు పాల్గొన్నారు.
