Thursday, September 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమండలస్థాయి ఎస్జిఎఫ్ఐ క్రీడా పోటీలు ప్రారంభం

మండలస్థాయి ఎస్జిఎఫ్ఐ క్రీడా పోటీలు ప్రారంభం

📰 Generate e-Paper Clip

మల్లాపూర్,సెప్టెంబర్8,(నవగీతం): విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, క్రీడల ద్వారా విద్యార్థుల్లో మానసిక,శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు,జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని మండల విద్యాధికారి కే దామోదర్ రెడ్డి అన్నారు.2026-27 విద్యా సంవత్సరానికి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండలస్థాయి క్రీడా పోటీలు  మంగళవారం సాతరం ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి.మండలంలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు.మండలస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేసేందుకు సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో మూడు రోజుల పాటు వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు.ఈ క్రీడా ఉత్సవాలను మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి,మండల అభివృద్ధి అధికారి శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ పోతవేణి నారాయణ గౌడ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు జలపతి రెడ్డి,గొర్రెపల్లి సర్పంచ్ వెంకట్ రెడ్డి నాయకులు దప్పుల నర్సయ్య,మాట్లా సోమయ్య,గడ్డం సోమరెడ్డి,సాతారం ఉపసర్పంచ్  జగన్ రెడ్డి పాఠశాలప్రధానోపాధ్యాయులు శ్రీహరిప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు అపర్ణ ఎస్జిఎఫ్ఐ మండలకన్వీనర్ వినోద్ మండలంలోని అన్ని పాఠశాలల నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు,ఇతర ఉపాధ్యాయులు,ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular