మల్లాపూర్,సెప్టెంబర్10,(నవగీతం): మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన శంభు తిరుపతి-అనిత దంపతుల కుమారుడు త్రినయ్ ఇటీవల జరిగిన ఎంబీబీఎస్ మొదటి రౌండ్ కౌన్సిలింగ్ ఫలితాల్లో స్టేట్ మెరిట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ మండల అధ్యక్షుడు సంగ గంగరాజం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యుడిగా ఎదగాలనే లక్ష్యంతో చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ క్రమశిక్షణతో కష్టపడి చదివి మంచిర్యాంకు సాధించడం ఎంతోమంది విద్యార్థులక ఆదర్శం భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదిగిప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అరకంటి గంగ మల్లయ్య,వేల్పుల రాజం,జాల మల్లేష్,ఎగుర్ల కొమురయ్య,తొట్ల మల్లయ్య, బింగి మల్లేష్, మధు, సంపత్, రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు
