మల్లాపూర్,సెప్టెంబర్10,(నవగీతం): ఎంబిబిఎస్ లో సీటు సాధించిన కేరళ హైస్కూల్ పూర్వ విద్యార్థిని మోతే హన్సిక ను కేరళ హై స్కూల్ ప్రిన్సిపల్ సీబీ.అనిల్ సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అనిల్ మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివి ప్రస్తుతం ఎంబిబిఎస్ లో సీటు పొందటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ,రాబోయే రోజుల్లో డాక్టర్ గా ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షీనా, సాయి రాణి,శ్వేత,రజిత లు పాల్గొన్నారు.
