Monday, September 28, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

మహనీయుల ఆశయాలను కొనసాగించాలి : అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్

జగిత్యాల,సెప్టెంబర్27,(నవగీతం)

కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలిదశ ఉద్యమ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాం పాలనలో వందేమాతరం పాడితే శిక్షించే రోజుల్లో బాధితుల తరుపున లాయర్ గా వాధించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన యోధుడు అని కొనియాడారు. బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా పోరాటం చేసి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి సైతం స్వచ్ఛందంగా రాజీనామా చేసిన తెలంగాణ వాది.తన చివరి శ్వాస వరకు తెలంగాణ కోసమే పోరాటం చేసిన ఉద్యమకారుడు అని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించినప్పుడే మనం అయనకీచ్చే నిజమైన నివాళి అని తెలియచేసారు.

ఈ కార్యక్రమం లో బి.సి సంక్షేమ శాఖ అధికారి, జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular