నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయ ఆవరణలో నిర్వహించిన సుప్రభాత సేవలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఆమె, అనంతరం స్వామివారి ప్రత్యేక దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, జగిత్యాల జిల్లా అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు కలగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ
వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనాలు అందించగా, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దర్శనం కలగడం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని, ప్రతి భక్తుడికి స్వామివారి అనుగ్రహం లభించాలని ఆకాంక్షించారు. శ్రీవారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.ఈ దర్శన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందారు.
