మల్లాపూర్,సెప్టెంబర్8,(నవగీతం):ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ రెడ్డి సామాజిక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రెడ్డి సంఘం నాయకులు మంగళవారం మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చట్టంపై గౌరవంతో పోలీసులను ఆశ్రయించినట్లు వారు తెలిపారు. రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని,ఈ వ్యాఖ్యలపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సమాజంలోని ఏ వర్గాన్నీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు బద్దం శ్రీనివాస్ రెడ్డి,దామెరా రాజశేఖర్ రెడ్డి,ఏనుగు రాం రెడ్డి,జీవన్ రెడ్డి, బద్దం రాం చందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
