Sunday, September 20, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలతీర్మానాలు లేకుండా గ్రామపంచాయతీ నిధులు డ్రా

తీర్మానాలు లేకుండా గ్రామపంచాయతీ నిధులు డ్రా

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల/కొడిమ్యాల

కొడిమ్యాల గ్రామ పంచాయితీలో అధికారిక తీర్మానాలు లేకుండానే నిధులు డ్రా చేస్తున్నారని వార్డు సభ్యులు ఆరోపించారు. గురువారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో నిర్వహించిన వార్డు సభ్యుల సమావేశం అనంతరం వారు పత్రికా ప్రకటన విడుదల చేశారు.గ్రామంలోని మైసమ్మ చెరువు నుంచి నాచుపల్లి వెళ్లే దారిలోని బ్రిడ్జి వరకు ఉన్న చిలుక వాగు శుభ్రపరిచే పనుల కోసం రూ.5 లక్షల 85 వేల నిధులను ఎలాంటి తీర్మానాలు లేకుండా ఉపసంహరించుకున్నట్లు సభ్యులు ఆరోపించారు.ఇకపై గ్రామ పంచాయితీలో చేపట్టే అభివృద్ధి పనులు తప్పనిసరిగా పాలకవర్గం ఆమోదంతో లేదా టెండర్ విధానంలోనే నిర్వహించాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు.ఈ మేరకు సర్పంచ్‌తో పాటు ఈఓ వంశివర్ధన్‌కు వినతిపత్రం అందజేసినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుర్రం నర్సయ్య గౌడ్, వార్డు సభ్యులు కొలకని మహేందర్, చిట్టిపాక రమేష్, మ్యాక రామ, పర్లపల్లి అఖిల్, రాపర్తి నర్సింగం, దుబ్బాక రాధా, రాచకొండ దివ్య, కొండ కృష్ణవేణి, బోగ గౌతామి, జక్కుల రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular