ప్రజల ప్రాణాలంటే అధికారులకు, పాలకులకు అంతా చులకన..?
వారి దృష్టికి తీసుకెళ్లిన కూడా ఏమీ పట్టనట్లు అలా ఎలా ఉండగలుగుతున్నారు -అంటున్న వార్డు ప్రజలు
నవగీతం, ఇబ్రహీంపట్నం ప్రతినిధి: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో 1వ వార్డు ప్రాంతంలో మంగళవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి వార్డు జలమయంగా మారింది. వరద నీరు, మురికి నీరు, చేరి వార్డులో రోడ్డు డ్రైనేజీలు కనబడకుండా అయిపోవడంతో వార్డు ప్రజలు ఎక్కడ అడుగేస్తే ఏమి జరుగుతుందో అని ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ప్రధాన రహదారి పక్కన డ్రైనేజీ నిర్మాణం లేకపోడంతో మోకాళ్ళ లోతు నీరు చేరి నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది.అధికారులు పాలకులు ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని ఒక్క రోజు కురిసిన వర్షానికి రోడ్డు వీధి జలమయమాయ్యాయని అధికారులు, పాలకుల,నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన పెడచెవిన పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ 1వ వార్డులో ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి నెలకొంటున్నా శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు పాలకులు విఫలమవుతున్నారని స్థానికులు అరోపిస్తున్నారు. ఉన్న డ్రైనేజీ కాల్వలను సకాలంలో శుభ్రం చేయకపోవడం వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక రోడ్లపైనే నీరు నిలుస్తోందని అంటున్నారు.విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఈ మార్గంలో నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క రాత్రి కురిసిన వర్షానికే దారిగుండా వరద మయంగా మారడంతో గ్రామ అభివృద్ధిపై ప్రశ్నలు లేవనేత్తుతోందని స్థానికులు పేర్కొంటున్నారు . అంతె కాకుండా నిలువ ఉన్న వర్షపు మురికి నీరు దుర్వాసన వెదజల్లుతూ ఈగలు, దోమలు, విపరీతంగా పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజల ఆరోగ్యనికి ఇబ్బందిగా మరుతుందని కాలానివాసులు ఆవేదన వ్యక్తం చేశారు . వర్షాకాలం ప్రారంభమైనప్పటికి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై వార్డు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇకనైనా ప్రజలు అనారోగ్యనికి గురై ఆసుపత్రుల పాలై ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి రాకముందే అధికారులు అప్రమత్తం కావాలని కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టి నీరు నిల్వకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచలని ప్రమాదాలు జరగక ముందే శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

