నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండల కేంద్రం లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో భరత మాత కూడలి నుండి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పది శాతం (10%) విద్యార్థుల ఎన్రోల్మెంట్ గురించి తీర్మానం చేశారు. ఈ సమావేశంలో మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అనగా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం, మంచినీటి వసతి, మరియు మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, పిల్లల భద్రత, డ్రగ్స్ నివారణ, మరియు ఆరోగ్య రక్షణకు సంబంధించి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్.ఎం చంద్ర మోహన్ రెడ్డి,ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్, ముష్కరి రమేష్, మహమ్మద్ షబ్బీర్, శనిగారపు నరేష్, ఉపాధ్యాయులు సుంచుల నర్సయ్య, ఏ.భాస్కర్, టి.సురేష్,డి.శివరాములు జీ.సౌజన్య, ఈ. రాజశేఖర్,ఎం.డీ సాజీద్, సలీమోద్దీన్,యు. రమేష్,జీ. శ్రీనివాస్, టి.ప్రవీణ్ కుమార్, సీ.హెచ్ విక్రమ్,టి. దివ్య, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


