నవగీతం,మల్లాపూర్:
పరమ పూజ్య దీదిగారి జన్మదినం సందర్భంగా మల్లాపూర్ మండల కేంద్రంలో స్వాధ్యాయ పరివారం తరపున సార్వత్రిక స్థలమైన సోమేశ్వర కొండ కింద ఆదివారం రోజున మొక్కలు నాటడం జరిగింది. ప్రతి మొక్కలోని భగవంతుని దర్శించాలని దాదాజీ మార్గంలో నడవాలని సూచించారు .ఈ కార్యక్రమంలో శ్రీపాద వెంకటాద్రి, పొలాస రాజయ్య చారి, శనిగారపు శంకర్, రుద్ర రాంప్రసాద్, కైరా నాగేష్, త్యాగ రాజన్న, రాధక్క, సరస్వతి, భువనేశ్వరి, యశశ్రీ స్వాధ్యాయ గ్రామ పరివారం పాల్గొన్నారు.

