Monday, September 21, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవర్షకొండలో ఘనంగా మారెమ్మ పండుగ బోనాలు

వర్షకొండలో ఘనంగా మారెమ్మ పండుగ బోనాలు

📰 Generate e-Paper Clip

నవగీతం ఇబ్రహీంపట్నం :

ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో మారెమ్మ పండుగ వేడుకలు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్దలతో ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని డప్పు చప్పుల్ల నడుమ బోనాలు ఎత్తుకొని పుర వీధుల్లో శోభయాత్ర చేపట్టారు.పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు.మారెమ్మ పండుగను ప్రతి సంవత్సరo భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నట్లు కుల సంఘ పెద్దలు విడిసి సభ్యులు తెలిపారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ గ్రామంలో వర్షాలు బాగా కూరవాలని పంటలు సమృద్ధిగా పండాలని ముఖ్యంగా గ్రామ ప్రజలకు ఎలాంటి రోగాలు రాకుండా ఆయురారోగ్యలు ప్రసాదించాలని గ్రామ దేవత మారెమ్మ ను కోరుకుంటూ ఈ పండుగ నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొనుకంటి చిన్న వెంకట్, ఉపసర్పంచ్ తుమ్మల జయ నర్షయ్య, జంగా విజయ్, మంగిలిపెళ్ళి లక్ష్మణ్,తోట గణేష్, తోకల రాజన్న,కాళేశ్వరం రాకేష్, దొంతుల శివ, ఇంద్రకరణ్, సురేష్, దూది గణేష్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular