Sunday, September 20, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధన...

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధన…

📰 Generate e-Paper Clip

మెట్ పల్లి మండలం తహసీల్దార్ నీతూ…

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

మండలంలోని వెల్లుల గ్రామంలో
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు.ఈ సమవేశానికి ముఖ్య అతిథిగా మెట్ పల్లి
మండలం తహసీల్దార్ నీతూ
హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు
మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య బోధన జరుగుతుందని,
చక్కటి సౌకర్యాలు, మంచి పరిజ్ఞానం, అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు పొందాలని తెలిపారు. 2025-2026 విద్యా సంవత్సరంలో 6 నుండి 9 వ తరగతి చదివిన విద్యార్థులకు “ప్రగతి పత్రాలు” తల్లిదండ్రుల సమక్షంలో అందచేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి, ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి,ఉపాధ్యాయులు రాజారామ్, రజిత, చంద్రయ్య, స్కైలాబ్, సత్యనారాయణ,సురేఖలు మరియు మండల రెవిన్యూ అధికారి ఉమేష్, గ్రామ పరిపాలన అధికారి నాగరాణి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular