Friday, September 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలబాసర త్రిబుల్ ఐటీ సీటు విజేత మనస్విని కి ఘన సన్మానం.

బాసర త్రిబుల్ ఐటీ సీటు విజేత మనస్విని కి ఘన సన్మానం.

📰 Generate e-Paper Clip

నవగీతం,(మల్లాపూర్ ప్రతినిధి):

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన బద్దం మనస్విని బాసరలో త్రిబుల్ ఐటీ లో సీటు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. సింగిల్ విండో చైర్మన్ నేరెళ్ల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుండి వెళ్లి మల్లాపూర్ మోడల్ స్కూల్లో అత్యధిక మార్కులు సాధించి బాసర త్రిబుల్ ఐటీ లో సీటు రావడం చాలా సంతోషాన్నిస్తుందని మా గ్రామానికి ప్రత్యేకమైన పేరు తెచ్చిందని కొనియాడారు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేసిన వారికి మాత్రమే ఇలాంటి అవకాశాలు వస్తుంటాయని భవిష్యత్తులో మనశ్విని పట్టుదలతో చదివి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు రాబోయే విద్యార్థులందరూ మనశ్విని నీ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రాజేందర్, గడ్డం లింగారెడ్డి ,అంజిరెడ్డి అందే సత్యనారాయణ, వినోద్ ,దురిశెట్టి రాజేశం, సాయికుమార్, శ్రీధర్ గౌడ్, లక్ష్మారెడ్డి, హనుమంత రెడ్డి, విష్ణువర్ధన్ రాజు ,తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular