నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో పల్స్ పోలియో కార్యక్రమం గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు ప్రారంభించారు.ఈ సందర్బంగా మేజర్ గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో వ్యాధి రాకుండా నిరోధించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక బృహత్తర కార్యక్రమమే “పల్స్ పోలియో”అని అన్నారు. వైద్యాధికారి డాక్టర్ వాహిని రావు మాట్లాడుతూ..మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా 32 బూతులు లో 4970 పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని అలాగే గ్రామ పరిసరాల్లో ఉన్న ఇటుక బట్టీలు స్టోన్ క్రషర్లు పౌల్ట్రీ ఫార్మ్స్ రైస్ మిల్లులు దగ్గర ఉండే కార్మికుల పిల్లలకు వారి దగ్గరికి వెళ్లి పోలియో చుక్కలు వేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమం లో మండల వైద్యాధికారి డాక్టర్ వాహిని రావు,ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, వైద్య సిబ్బంది రామ్మోహన్ విజయ శకుంతల మాహేశ్వరి సుమలత ఉమాదేవి శ్రీనివాస్ రవీందర్ కృష్ణారావు ఆశాలు ఏ ఎన్ యం లు వార్డు సభ్యులు ముష్కరి రమేష్,ముత్యాల గంగా రాజం,కొంపెల్లి రాకేష్,భుక్యా శేఖర్ మాజీ ఎం.పీ.టీ.సీ మొరపు గంగా రాజం,మొరపు లక్ష్మి,అల్లె లత,కదుర్క లక్ష్మి, ఏనుగు లక్ష్మి,లీలా రాణి,సామజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


