Saturday, September 19, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమాట నిలబెట్టుకున్న మున్సిపల్ కౌన్సిలర్

మాట నిలబెట్టుకున్న మున్సిపల్ కౌన్సిలర్

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి టౌన్ :

మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ వార్డు కౌన్సిలర్ మాట నిలబెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే… మెట్ పల్లి పట్టణంలోని 15వ వార్డులో నివాసం ఉంటున్న శ్రీపతి రత్న అని మహిళ అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు మున్సిపల్ కౌన్సిలర్ అరిగెల అనూష రాకేష్ పటేల్ శనివారం ఆర్థిక సహాయం అందజేశారు. వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ పేద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే తక్షణ సహాయం కింద రూ. 5000 ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా సైనిక్ ఫౌండేషన్ తరపున 25 కిలోల బియ్యం బస్తా అందజేశారు. భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని, వార్డు ప్రజల కష్ట సుఖాలలో తోడుగా ఉంటామని 15వ వార్డు బీజేపీ ఇంచార్జీ, సైనిక్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు అరికెల రాకేష్ పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular