Monday, August 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి: జువ్వాడి

మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి: జువ్వాడి

📰 Generate e-Paper Clip

మొక్కలు పంపిణీ చేసిన జువ్వాడి కృష్ణారావు

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో పర్యావరణ పరిరక్షణ మరియు హరితహారం లక్ష్యంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జువ్వాడి కృష్ణారావు గ్రామ ప్రజలకు మొక్కలను పంపిణీ చేసి, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటిని పెంచి పరిరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత” అని పేర్కొన్నారు. పచ్చని గ్రామాల నిర్మాణంతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని తెలిపారు. గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్, ఏయంసి చైర్మన్,ఉపసర్పంచ్ తో కలిసి మొక్కలను నాటారు.అనంతరం సూపర్వైజర్,బి ఎల్ ఓ లను సర్ సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య, ఏ యం సి చైర్మన్ అంతేడుపుల పుష్పలత నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట్ల సోమయ్య,ఉప సర్పంచ్ జగ్గుల గంగాధర్, కార్యదర్శి కవిత,వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ మామిడి లక్ష్మారెడ్డి, అంతడుపుల గంగాధర్, జక్కుల కొమురయ్య, ధోనిపాల అంజయ్య,నాసం తిరుపతి, అండెం రాజేష్ కోటగిరి ఆనంద్ గౌడ్ వి ఓభారతి మహిళా సభ్యులు గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular