Monday, August 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలస్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి

స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి

📰 Generate e-Paper Clip

తెలంగాణ ఇంచార్జి  నేమురి శంకర్ గౌడ్,ప్రచార కార్యదర్శి ఆర్ కె సాగర్

నవగీతం, కరీంనగర్:

తెలంగాణ లో రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ లో రాష్ట్ర ఇంచార్జి నేమురి శంకర్ గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్ కె సాగర్ నిర్వహించిన ముఖ్య నాయకుల సమీక్షా సమావేశానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కందుల రాజీ రెడ్డి, కరీంనగర్ నియోజకవర్గ జనసేన నాయకులు కాస రాజు పటేల్ హాజరయ్యారు.ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు, ఎన్నికల వ్యూహాలు, ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లే కార్యాచరణపై రాష్ట్ర నాయకత్వం కీలక సూచనలు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరీంనగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేసి, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలతో కలిసి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో కరీంనగర్ నాయకులు వీర్ల శ్రీనివాస్ రావు, మహాదేవ రాజ్ కుమార్, పొన్నాల తిరుపతి,వేముల కళావతి, డాక్టర్ మహేష్, గాలిపెల్లి కుమార్,వేణు రెడ్డి, మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular