Wednesday, April 15, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఅఖిల బ్రాహ్మణ సేవా సంఘ క్యాలెండర్  ఆవిష్కరణ

అఖిల బ్రాహ్మణ సేవా సంఘ క్యాలెండర్  ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల

జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల పొలాస ధర్మపురి కొండగట్టు అయ్యగార్లచే తమకు మొదటి నుంచి అనుబంధం ఉన్నదని అన్నారు తమ ఇంటి నుండి బ్రాహ్మణ వాడ ప్రారంభమవుతుందని శ్రీరామ మందిరంలో కొంత భాగం శిథిలం కాగా టీటీడీ దేవస్థానం ప్రభుత్వం దాతల సహకారంచే ధ్యాన మందిరం నిర్మించుకోవడం జరిగిందని గుర్తు చేశారు.నిర్మాణానికి సహకరించిన దాతలకు అధికారులకు టీటీడీ దేవస్థానం వారికి సహకార అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ ప్రతినిధులు సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, మోతే ఉమాకాంత్ శర్మ, మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, కొత్తపల్లి శ్రీనివాస్ శర్మ, సిరిసిల్ల రఘుపతి శర్మ,గోవర్ధన్ శర్మ, శ్రీధర్ గణపతి, చాకుంట వేణు మాధవరావు మాధవరావు, మెట్ట కిరణ్, సిరిసిల్ల పార్థసారథి శర్మ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular