నవగీతం,మెట్ పల్లి:
ఈ నామినేషన్ కు ఓ లెక్కుంది.. గబ్బర్ సింగ్ అండా ఉంది.. అంటూ వినూత్నంగా నామినేషన్ కేంద్రానికి వెళ్ళాడు.మెట్ పల్లి మున్సిపల్ 17వ వార్డు కు చెందిన మ్యాడరపు మారుతి జనసేన పార్టీ అభ్యర్థి ముఖానికి పవన్ కళ్యాణ్ మాస్కు ధరించి మెడలో గబ్బర్ సింగ్ టాగ్ వేసుకొని విన్నుత రీతిలో నామినేషన్ కేంద్రానికి వెళ్లి నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ కేంద్రానికి వచ్చేటప్పుడు ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ జయహో గబ్బర్ సింగ్ అంటూ నినాదాలు చేశారు.

