బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు
నవగీతం, మెట్ పల్లి
తమ పార్టీకి చెందిన మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని, మున్సిపల్ చైర్మన్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డులకు చెందిన బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే ముందు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘును కలిశారు. ఈ సందర్భంగా వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద బీజేపీ అభ్యర్థులు కలువగా వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుని మున్సిపల్ లో బీజేపీ జెండాను ఎగరేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్నికల ఇంచార్జీ అమ్దాపూర్ రాజేష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి, బొడ్ల ఆనంద్, కొయ్యల లక్ష్మణ్, న్యాయవాది బద్దం గంగాధర్, నాయకులు బొడ్ల అనిల్, ముక్క నరేష్, జెట్టి సతీష్, భోగ త్రిలోక్, జెట్టి రూపేష్ తదితరులు పాల్గొన్నారు.

