Saturday, May 30, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఐక్యత ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు క్రీడా పోటీలు

ఐక్యత ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు క్రీడా పోటీలు

📰 Generate e-Paper Clip

సర్పంచ్ కళ రమేష్

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్ నేతృత్వంలో గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్,వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ,గ్రామ యువతలో క్రీడా స్పూర్తిని ప్రోత్సహించాలని, ఐక్యత ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని సర్పంచ్ కళ రమేష్ తెలిపారు.ఈ పోటీల్లో మొత్తం గ్రామానికి చెందిన 8 క్రికెట్ జట్లు 12 వాలీబాల్ జట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోల్కొండ కళ రమేష్, ఉప సర్పంచ్ దండవేని రాజేందర్ ,వార్డు సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు యేలేటి జలపతి రెడ్డి ,వీడీసీ చైర్మన్ వంగ శ్రీనివాస్ ,  వీడీసీ సభ్యులు, క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular