Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఓటరు జాబితాలపై ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి.

ఓటరు జాబితాలపై ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి.

📰 Generate e-Paper Clip

నవగీతం,నిర్మల్

మున్సిపాలిటీ ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 12న వార్డుల వారిగా ఫోటో ఓటరు జాబితాలు, 13న డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలు, 16న తుది పోలింగ్ కేంద్రాల వివరాలు, పోలింగ్ కేంద్రాల వారిగా ఫోటో ఓటరు జాబితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాల ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular