Wednesday, April 15, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుకేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి

కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి

📰 Generate e-Paper Clip

బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

వగీతం వైరా

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కే.తారక రామారావు జనవరి 7న ఖమ్మం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు కోరారు.మంగళవారం జూలూరుపాడు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఆత్మీయ అభినందనసభ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సభలో ముఖ్యఅతిథిగా కల్వకుంట్ల కేటీఆర్ పాల్గొని ప్రజాప్రతి నిధులను శాలువాతో సత్కరించి, అభినందిస్తారన్నారు.ఈ సభకు వైరా నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular