నవగీతం, జగిత్యాల
గొల్లపల్లి మండలం మల్లనపేట గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి (మల్లన్న పేట జాతర) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ పరంగా కావాల్సిన భద్రతాపరమైన ఏర్పాట్లను చేసి ప్రశాంతంగా జాతర జరుగుటకు సహకరించినందుకు మల్లన్న పేట మల్లన్న ఆలయ కమిటీ సభ్యులు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ని జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో మర్యాద పూర్వకముగా కలిసి శాలువతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ, నవంబర్ 26 తేదీ నుండి డిసెంబర్ 17 వ తేదీ వరకు నిర్వహించిన మల్లన్నపేట జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారని, ఇటువంటి భారీ భక్తజనం పాల్గొనే కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవడంలో ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ శాఖకు పూర్తిస్థాయిలో సహకరించారని తెలిపారు. జాతర సందర్భంగా ఏ విధమైన నేరాలు, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా అమలు చేయడంలో డీఎస్పీ రఘు చందర్, ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్.ఐ కృష్ణ సాగర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఇతర పోలీస్ అధికారులు, ఎస్‌ఐలు, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బంది సమిష్టి కృషి వల్లనే జాతరను విజయవంతంగా నిర్వహించగలిగామని ఎస్పీ పేర్కొన్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా పండుగలు, జాతరలు, ఇతర ప్రజా కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున అవసరమైన అన్ని రకాల భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేశారు.యొక్క కార్యక్రమంలో ధర్మపురి సి.ఐ రామ్ నర్సింహారెడ్డి, ఎస్.ఐ కృష్ణ సాగర్ రెడ్డి, ఆలయ ఈవో ట్రస్ట్ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

