Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలజిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా గడ్డం జీవన్ రెడ్డి

జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా గడ్డం జీవన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నవగీతం,కొడిమ్యాల

కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డిని జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరమ్ ఉపాధ్యక్షులుగా నియమించారు. ఈ విషయాన్ని ఫోరమ్ అధ్యక్షులు బొల్లిశెట్టి గంగారెడ్డి అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా గడ్డం జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఫోరమ్ అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నియామకానికి సహకరించిన చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం, జగిత్యాల శాసన సభ్యులు ఎం. సంజయ్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ అభివృద్ధి, సర్పంచుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా బాధ్యతాయుతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ సర్పంచులు జీవన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో జిల్లా సర్పంచుల ఫోరమ్ మరింత బలోపేతం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular