Wednesday, April 15, 2026
ads
Homeఎడిటోరియల్జీవో 190 అమలుకు చర్యలు చేపట్టాలి.

జీవో 190 అమలుకు చర్యలు చేపట్టాలి.

📰 Generate e-Paper Clip

జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి-టిఆర్టిఎఫ్ డిమాండ్

నవగీతం,జగిత్యాల

జీఓ317 అమలులో ఏర్పడిన లోపాలను సరిదిద్దుతూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ190ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని అలాగే పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల డిప్యుటేషన్ ప్రక్రియను మున్సిపల్ ఎన్నికల కంటే ముందే పూర్తిచేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి బేతి సాయికృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీఓ 317 కారణంగా అనేక మంది ఉపాధ్యాయులు అన్యాయంగా డిస్‌లోకేటెడ్ అయి, కుటుంబాల నుంచి దూరంగా,తీవ్రమైన మానసిక-ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం జీఓ 190ని జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో డిప్యుటేషన్ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల ఉపాధ్యాయుల ఇబ్బందులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో వినియోగించే అవకాశం ఉన్నందున, అంతకుముందే ఈ ప్రక్రియ పూర్తయితే విద్యా వ్యవస్థకు మరియు ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular