Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుతారకరాముడికి 'అమరజ్యోతి' నివాళి

తారకరాముడికి ‘అమరజ్యోతి’ నివాళి

📰 Generate e-Paper Clip

వర్ధంతి వేడుకల్లో ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పు రాజు

నవగీతం, పెద్దపల్లి

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం పిలుపు మేరకు నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ చైర్మన్ శ్రీమతి నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన మరియు ఉచిత వైద్య శిబిరాలను ఆమె ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు ఉప్పు రాజు పాల్గొని భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉప్పు రాజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు, ప్రతి ఏటా జయంతి మరియు వర్ధంతి వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమాల గురించి భువనేశ్వరికి వివరించారు.పెద్దపల్లి జిల్లాలో ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న కృషిని అభినందించిన భువనేశ్వరి,రానున్న రోజుల్లో ఎన్టీఆర్ అభిమానులకు, కార్యకర్తలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular