Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పండ్లు పంపిణీ

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పండ్లు పంపిణీ

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలి: మానుక ప్రవీణ్ కుమార్

నవగీతం,మెట్ పల్లి

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షులు మానుక ప్రవీణ్ కుమార్ రోగులకు పండ్లు పాలు బ్రెడ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తారక రామారావు తెలుగు చలన చిత్ర చరిత్రలో రాజకీయ రంగంలో ఒక చరిత్ర సృష్టించి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వ్యక్తి అని, కేవలం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల వ్యవధిలోని అధికారం చేపట్టి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఘనత ఎన్టీఆర్ కి దక్కిందనిఅన్నారు. చలనచిత్ర పరిశ్రమలలో ఎన్నో పాత్రలకు జీవం పోసి రాముడు, శ్రీకృష్ణుడు, రావణ పాత్రలు పోషించి ఇటు రాజకీయ రంగంలోనూ అలాగే  రెండు రూపాయలకి కిలో బియ్యం, పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు,జనత వస్త్రాలు, పక్కా గృహ నిర్మాణ పథకం,మండలిక వ్యవస్థ, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు చేపట్టి తెలుగు ప్రజలలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని అలాగే కేంద్రంలో కూడా నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా చరిత్ర సృష్టించి కేంద్ర ప్రభుత్వం లో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసిన ఘనత మన ఎన్టీఆర్  అని, కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్రం వెంటనే ఎన్టీఆర్ కు భారతరత్న బిరుదును ప్రకటించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పోడేటి రమేష్ గౌడ్, రహీం, ఎండి రఫీ యుద్దీన్,కొక్కుల మహదేవ్, ఎనుగందుల శ్రీనివాస్, పాతర్ల విజయ్ కుమార్, బాదం మోహన్, ఎల్ అంజయ్య, రమేష్,అలాగే తెలుగు మహిళా నాయకురాలు మైనార్టీ నాయకురాలు రజియా బేగం, మిశ్రా కౌసర్, సాజిదా పర్వీన్, రాణి, కమల, రుచిత, తెలుగు యువత నాయకులు నదీమ్, సుల్తాన్, సిద్ధార్థ  భాను తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular