నవగీతం,రాయికల్
రాయికల్ పట్టణంలో స్థానిక భక్త మార్కండేయ దేవాలయంలో పద్మశాలి అఫీషియల్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (POPA) ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ మోర హన్మాండ్లు,రాష్ర్టకార్యదర్శి జక్కుల చంద్రశేఖర్, జగిత్యాల జిల్లా పోపా అధ్యక్షులు కొక్కుల రాజేష్, ప్రధాన కార్యదర్శి దండే గోవర్ధన్, కార్యదర్శి కస్తూరి శ్రీధర్,రాయికల్ పోపా అధ్యక్షుడు దాసరి రామస్వామి,పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు భోగ రాజేశం,యువజన సంఘం అధ్యక్షుడు సామల సతీష్, మండల అధ్యక్షుడు గాజెంగి అశోక్, మాచర్ల మహేష్-స్వరూప మరియు పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

