నవగీతం,జగిత్యాల
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం FLN (Foundational Literacy and Numeracy) పై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ జిల్లాలోని యం ఈ ఓ లకు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ప్రాథమిక పాఠశాల లో జరుగుతున్న ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం ప్రగతి పైన చర్చించడం జరిగింది.

మండలాల వారీగా పిల్లలు చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు, గుణకరాలు మరియు భాగహారాలలో మండలాల వారీగా సమీక్ష చేసి, రేపటి నుండి జరిగే ప్రాథమిక స్థాయిలో జరిగే సమావేశాలలో పాఠశాల వారీగా డేటా ను విశ్లేషహించుకొని, ఉపాధ్యాయులకు లక్ష్యం నిర్దేశించి రాబోయే 40 రోజులలో అందరు విద్యార్థులు కనీస అభ్యసన స్థాయిలు సాధించేలా ప్రణాళిక వేసుకోవాలని, తిరిగి తరగతి గదులలో జరిగే బోధనాభ్యసన ప్రక్రియ ను పర్యవేక్షించాలని ఆదేశించారు.పదవ తరగతి లో పిల్లలు అందరూ ఉత్తీర్ణులు అయ్యేవిధంగా, వెనక బడిన పిల్లలకు ప్రత్యేక తరగతులలో సందేహాలను నివృత్తి చేసి 100% ఫలితాలను సాధించేలా కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.

