నవగీతం, జగిత్యాల
మాజీ మంత్రి జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు జగిత్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలో నేరేళ్ల గ్రామానికి చెందిన బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జాజాల రమేష్ పాల్గొని జీవన్ రెడ్డి ని శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాజాల రమేష్ మాట్లాడుతూ, బీసీల రిజర్వేషన్ల పెంపు అంశంపై అసెంబ్లీలో జీవన్ రెడ్డి స్పష్టమైన వైఖరి తీసుకొని బీసీల హక్కుల కోసం మాట్లాడరాని అన్నారు.ప్రజాజీవనానికి అంకితమైన నాయకుడిగా సేవాభావంతో ముందుకు సాగుతున్న జీవన్ రెడ్డి మరెన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండి ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాసరపు సాంబయ్య గౌడ్, వేముల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

