Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలమున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలి.

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలి.

📰 Generate e-Paper Clip

జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు

నవగీతం,జగిత్యాల

జగిత్యాల పట్టణంలోని ఉమాశంకర్ గార్డెన్స్ లో జగిత్యాల నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు తో కలిసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ డా. బోగ శ్రావణి పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోబోతున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నియోజకవర్గంలోని జగిత్యాల మున్సిపల్ ,రాయికల్ మున్సిపల్ కి 75కోట్ల నిధులు అమృత్ 2.0 పథకం ద్వారా మంజూరు చేపించిన ఘనత నిజాంబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి కి దక్కుతున్నాను,ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పై ఉంది. పోటీ చేసే అభ్యర్థులు తమ వార్డులలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించి మున్సిపాలిటీలో బిజెపి అధికారంలోకి తీసుకువచ్చే దిశగా వెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్,రాయికల్ మండల అధ్యక్షులు కుర్మా మల్లారెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా కోకన్వీనర్ మిట్టపల్లి సాయికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి,జిల్లా కోశాధికారి సుంకట దశరథ్ రెడ్డి, రగిల్ల సత్యనారాయణ మరియు జిల్లా,మండల పదాధికారులు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular